Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పప్పువర్మ' చిత్రాన్ని ఆమెకు అంకితం ఇస్తా: జొన్నవిత్తుల వెల్లడి

  • మీడియా చానల్ లో చర్చా కార్యక్రమం
  • మియా మాల్కోవా గురించి ప్రస్తావించిన జొన్నవిత్తుల
  • ఎక్కడాలేని విధంగా ఫస్ట్ సాంగ్ ఇనాగరేషన్ ఉంటుందని వెల్లడి
తనను జొన్నవిత్తుల చౌదరి అన్నాడంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గీత రచయిత జొన్నవిత్తుల తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వర్మపై బయోపిక్ తీస్తానని, దానికి పప్పువర్మ అనే పేరు పెడతానని ఇప్పటికే జొన్నవిత్తుల ప్రకటించారు. తాజాగా ఓ మీడియా చానల్ చర్చా కార్యక్రమం నుంచి మాట్లాడుతూ, పప్పువర్మ అనే చిత్రంలో వర్మ ఆలోచనా విధానాన్ని చూపిస్తానని, ఆ సినిమాను మియా మాల్కోవా అనే నటీమణికి అంకితం ఇస్తామని వెల్లడించారు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీసి బాలకృష్ణకు అంకింతం ఇచ్చినప్పుడు, తాను పప్పువర్మ చిత్రాన్ని మియా మాల్కోవాకు ఇవ్వడంలో తప్పులేదని అన్నారు.

ఈ ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఫస్ట్ సాంగ్ ఇనాగరేషన్ ఉంటుందని జొన్నవిత్తుల చానల్ సాక్షిగా ప్రకటించారు. తనలో ఈ ఆలోచన రావడానికి పప్పువర్మే కారణమని వివరించారు. వర్మ వ్యక్తిగత జీవితంలో ఎన్ని తమాషాలు ఉన్నాయో అన్నీ చూపిస్తామని, అతడి గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పారని జొన్నవిత్తుల వెల్లడించారు.
Pappuvarma
Jonnavithula
Tollywood

More Telugu News